మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్‌లో ఉన్నాయి. కాగా ఈరోజు దర్శకుడు మోహన్ రాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా #చిరు153 టీం ఆయన శుభాకాంక్షలు తెలియజేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్ అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో…