సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్…