India vs West Indies T20I First Match First Innings: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌లు వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లతో ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు. ఎడాపెడా షాట్లు బాదుతూ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన…
Ricky Ponting Chose Rishabh Pant Over Ishan Kishan For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లకి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చాలామంది ఆటగాళ్లు లైనప్‌లో ఉండటంతో, ఎవరికి చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. కొందరు మాజీలు మాత్రం రిషభ్ పంత్‌ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, ఆ సిరీస్‌లో బ్యాట్స్మన్‌గా…
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్‌గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్…
కేవలం బ్యాట్‌తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు.…
గత మూడేళ్ల నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న దినేశ్ కార్తీక్.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా అవతరించి, జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దినేశ్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్ననారు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు. ‘‘ప్రస్తుతం…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్‌లో…
అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తుది జట్టులో ఎవరెవరికి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న విషయాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాడు. రీసెంట్‌గానే ఇషాన్ కిషన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోవాల్సిందేనని, అతడ్ని ఓపెనర్‌గా రంగంలోకి దింపితే పరుగుల వర్షం కురవడం ఖాయమని ఆయనన్నాడు. కానీ, దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేయడం వృధా అంటూ బాంబ్ పేల్చాడు. కార్తీక్ ఆఖర్లో కేవలం రెండు, మూడు ఓవర్లు మాత్రమే ఆడతానంటే కుదరదని…
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి ఎవ్వరు ఉహించని విధంగా పురాగమనం చేశాడు. IPL 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణఫ్రికాతో రెండో టీ20కి…
కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140…