Ricky Ponting: ఇషాన్ కిషన్ వద్దు.. పంత్ బెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ricky Ponting Chose Rishabh Pant Over Ishan Kishan For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లకి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చాలామంది ఆటగాళ్లు లైనప్‌లో ఉండటంతో, ఎవరికి చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. కొందరు మాజీలు మాత్రం రిషభ్ పంత్‌ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, ఆ సిరీస్‌లో బ్యాట్స్మన్‌గా పెద్దగా రాణించకపోవడంతో.. వరల్డ్‌కప్ జట్టుకి అతడ్ని ఎంపిక చేయొద్దని మాజీలు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ టోర్నీలో దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యాలు ఫినిషర్లుగా కీలక పాత్ర పోషించగలరని.. వీరికి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తోడైతే, టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు తేలికేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే ఫార్మాట్‌లో తానెలా ఆడగలనో రిషభ్ పంత్ మరోసారి తనని తాను నిరూపించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లోనూ అతడు అదే విధంగా సత్తా చాటగలడు. అతనితో పాటు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దినేశ్ కార్తీక్‌కి నా వరల్డ్‌కప్ జట్టులో తప్పక చోటు ఉంటుంది. రిషభ్ మూడు, నాలుగు లేదా ఐదో స్థానంలో వచ్చినా.. దినేశ్, హార్దిక్ ఫినిషర్లుగా రాణించగలరు. వీళ్లు ముగ్గురూ చెలరేగితే టీమిండియాకు తిరుగు ఉండదు’’ అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
Also Read
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
అయితే.. ఇషాన్ కిషన్‌కి మాత్రం జట్టులో స్థానం దొరకడం కష్టమని రికీ పాంటింగ్ వెల్లడించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుందని.. ప్రస్తుతం వీరిద్దరిలో సూర్యకుమార్ మంచి ఫామ్‌తో ముందంజలో ఉన్నాడని చెప్పాడు. వీరితో పాటు ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉన్నారని, ఇలాంటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది సెలెక్టర్లకు తలనొప్పిగా మారడం ఖాయమని పేర్కొన్నాడు. తానైతే.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్లలో ఇషాన్‌కి బదులు పంత్‌కే ఓటు వేస్తానని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..