తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ…