‘అఖిల్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో దిలీప్, సైరాబానులతోనే ఎక్కువ సమయం గడిపింది. బుధవారం కన్నుమూసిన లెజండరీ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ ను తలుచుకుంటూ తన బాల్యంలో ఆయనతో ఆడుకున్న విశేషాలను తెలియచేస్తూ ఓ పాత ఫోటోను సాయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నా చిన్నతనంలో ఎక్కువ సమయం…
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ…
ద లాస్ట్ థెస్పియన్ దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతదేశ సినీ అభిమానులు బాధాతప్త హృదయులైపోయారు. భారతీయ సినిమా రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది సంతాపాలు తెలిపారు. కానీ చిత్రంగా బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్ మాత్రం దిలీప్ కుమార్ కు మతం అంటగట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్…
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో…