దిలీప్ విషయమై బీజేపీ పరువు తీసిన సొంతపార్టీ ఐటీ సెల్ అధిపతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద లాస్ట్ థెస్పియన్ దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతదేశ సినీ అభిమానులు బాధాతప్త హృదయులైపోయారు. భారతీయ సినిమా రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది సంతాపాలు తెలిపారు. కానీ చిత్రంగా బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్ మాత్రం దిలీప్ కుమార్ కు మతం అంటగట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్ కుమార్) హిందూ పేరు పెట్టుకుని చిత్ర పరిశ్రమలో డబ్బులు సంపాదించారు. ఆయన మరణం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.
Read Also : ‘పుష్ప’ రిలీజ్ ‘అప్పుడే’ అంటోన్న టాలెంటెడ్ స్టార్ హీరో…
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
దిలీప్ కుమార్ వంటి నట దిగ్గజానికి మతాన్ని అంటగట్టడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన మరణించిన సందర్భంలో ఇలాంటి ట్వీట్ చేయడం దారుణమంటూ విమర్శించారు. ఇక ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ నటి ఊర్మిళ అయితే ‘నిన్ను చూస్తే సిగ్గేస్తోంది’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. చిత్రం ఏమంటే… వేలాది మంది అరుణ్ యాదవ్ ను విమర్శిస్తూ ట్వీట్ చేసినా… తన ట్వీట్ ను సవరించడమో లేక డెలిట్ చేయడమో అతను చేయలేదు. తన చిత్త చాపల్యంతో సొంత పార్టీ పరువును అరుణ్ యాదవ్ తీశాడంటూ ఆ పార్టీకి చెందిన వారే కొందరు వాపోయారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..