Satya Nadella: ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. దానికి తెలుగు సీఈఓ అయిన సత్య నాదెళ్ల లేటెస్టుగా సంస్థ ఉద్యోగులను, ఇన్వెస్టర్లను, కస్టమర్లను, పార్ట్నర్లను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ రిపోర్ట్-2022లో పబ్లిష్ అయిన ఆ లేఖలో సత్య నాదెళ్ల పేర్కొన్న ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం డిజిటల్ టెక్నాలజీయే అని సత్య నాదెళ్ల చెప్పారు.