Christmas Scams 2025: డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ మోసాలకు గురౌతున్నారు. అయితే, పండుగలు, ప్రత్యేక ఈవెంట్లు వచ్చినప్పుడు ఈ స్కామ్‌లు మరింతగా పెరుగుతుంటాయి. ఇక, 2025 క్రిస్మస్ పండగ సమయంలో కూడా ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్‌లు తక్కువ సంఖ్యలో యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.