Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.