రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగాకు చాలా విశిష్టమయింది. మన పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనేది సామెత. మన చుట్టూ వున్న అనేక ఆకుకూరలు, కాయగూరలు అద్భుత ఔషధాలు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మునగచెట్టు అంటే కేవలం మునగకాడలే వాడాలని అంతా అనుకుంటారు. వాటికంటే మునగాకులోనే పోషకాలు ఎక్కువగా వుంటాయి. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మునగాకుతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.…
మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే…