పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్ గా మారిందని అవకాశౄలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బందును పుట్నాలు,…