కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.