BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
Income Tax Raid : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు, అతనికి సంబంధించిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు కూడా కొనసాగాయి.