Tollywood: సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికిగానూ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో ‘స్వాతిముత్యం’ సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని.. ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ ఛైర్మన్…