శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా.. అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ - వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.