అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అంటుంటారు. ఆ గ్రామంలో రైతులు కోటీశ్వరులు.. అక్కడ ఎకరం కోటికి పైగా ధర పలుకుతుంది. కొంచెం భూమి అమ్మితే డూప్లెక్స్ ఇళ్లు కట్టుకోవచ్చు.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగు పై ఆడ పిల్లల పెళ్ళి చేయవచ్చు. కానీ ఆ ఉళ్లో ఆడ బిడ్డలకు కళ్యాణ యోగం కలగడం లేదు. అన్నీ కుదిరినా పెళ్ళిళ్ళు మాత్రం వాయిదా వేస్తున్నారు. కట్నం ఇవ్వరని వరుడు తరపు బంధువులు పెళ్ళిళ్ళకు నో…
20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి… అమ్మితే వివరాలు ధరణి లో లేవు. 20 ఏళ్ళ తర్వతా కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ తప్పుడు నిర్ణయాల వల్ల నిన్న హత్యలు జరిగాయి. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏంటో..? ధరణిని అడ్డం పెట్టుకొని… హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నమూనా పోయింది.బీహార్ నమూనా వచ్చేసింది. కేసీఆర్…
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చారు.. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.. ధరణి అందుబాటులోకి వచ్చేముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.. తెలంగాణలో ధరణి శకం మొదలై ఏడాది పూర్తయింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా…
తెలంగాణ సీఎం గొప్ప సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారం డిమాండ్‌తో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అన్నింట్ల ముందంటివి.. వరి పండించడంలో రాష్ట్రం ముందంటివి.. ఇప్పుడూ వరి వేస్తే ఉరి అంటున్నావు ఏంటి? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నేను కూడా ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌నేనని గుర్తుచేసుకున్న ఆయన.. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ రెడీ చేసి ముందు సాధ్యాసాధ్యాలపై…