గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. భూ సమస్యలు లేని తెలంగాణ కోస ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల భూ సమస్యలు తీర్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నేటి నుంచి(జూన్ 03) ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ…
Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి…
Bhu Bharathi Bill: భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని ఈ సందర్బంగా తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, లక్షలాది మంది ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ధరణిని అర్థరాత్రి ప్రమోట్ చేశారని, నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు…