Dharani Special Drive: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములపై ఆయా శాఖలతో కమిటీ ప్రతినిధులు ప్రధానంగా చర్చించనున్నారు.
Dharani Committee: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సిఫార్సులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా ఈనెల 24న జిల్లా కలెక్టర్లతో సమావేశమైన విషయం తెలిసిందే.
ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది.