Viral Video: ఇండియా – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు క్రీడా రంగంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఆటలే కాదు, వాటికి సంబంధించిన ప్రతి వ్యక్తి భద్రత కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా అడ్డుకుంది. అయినా భద్రతా కారణాల దృష్ట్యా, మ్యాచ్‌ను వెంటనే నిలిపివేశారు.
Read Also: Operation Sindoor 2: ఎల్‌వోసీ, ఐబీ వెంట పాక్ విఫలయత్నం.. 50కి పైగా డ్రోన్లను తుక్కు చేసిన భారత్
సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను వెంటనే బయటకు పంపించారు. గ్రౌండ్ లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి, అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ పరిణామాలు ప్రేక్షకుల్లో, మ్యాచ్‌కు హాజరైన సిబ్బందిలో తీవ్ర ఆందోళనను కలిగించాయి. ఇలా ఉండగా, మ్యాచ్‌కి చీర్ గర్ల్‌గా వ్యవహరిస్తున్న ఓ మహిళ తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Samba : సాంబా సెక్టార్‌లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం
ఈ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక్కడ చాలా భయంగా ఉంది. అన్ని లైట్స్ ఆఫ్ చేశారు. మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఉంది” అంటూ భావోద్వేగంతో మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందిస్తూ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఆటను నిలిపివేయడం తప్పనిసరి అయిందని పేర్కొంది. ఆటగాళ్లు, ప్రేక్షకులు, సిబ్బంది భద్రత ప్రాధాన్యత అని.. ప్రభుత్వం, భద్రతా సంస్థల సూచనల మేరకు మరిన్ని మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
"Very very scary" – Cheer leader's SHOCKING video from Punjab Kings Vs Delhi Capitals IPL match in Dharamshala. pic.twitter.com/S830aDKer3
— Manobala Vijayabalan (@ManobalaV) May 8, 2025