బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో…