Dhaakad : నాలుగు భాషల్లో హల్చల్ చేయబోతున్న కంగనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో ఎక్కువ సినిమాలు ఉండటంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు కొత్త డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు.
Read Also : Vijay Deverakonda : లుక్ మార్చిన హీరో… ‘జన గణ మన’ కోసం కొత్త మేకోవర్
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
ఈ యాక్షన్ మూవీలో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రను పోషిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ మాఫియాకు అగ్ని ఎలా చెక్ పెట్టిందన్నదే ఈ చిత్రకథ. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్స్ సన్నివేశాలను ఆ మధ్య బుడాపెస్ట్ లోనూ చిత్రీకరించారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహిస్తున్న ‘ధాకడ్’లో అర్జున్ రామ్ పాల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దివ్యా దత్, షరీబ్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన నటనతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటున్న కంగనా రనౌత్ మరి ఏజెంట్ అగ్నిగా ఎలా మెప్పిస్తుందనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల కాబోతున్న మే 27వ తేదీన వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ చిత్రాలు విడుదల కానున్నాయి. అలానే ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ సినిమానూ అదే తేదీ విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో కంగనా చిత్రానికి తెలుగులో ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది అనుమానమే!
తాజావార్తలు
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!