తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఆలయ గార్డును పోలీసులు చితకకొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు.. ఆయా ఘటనల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేటుపై వివరాలను చంద్రబాబు వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఆయా ఘటనల్లో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్…