మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.