రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఐటం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. అలాగే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తమ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజు (ఆగస్ట్2)ను గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారాయన. ‘ ‘వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న…
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలు సినిమా సగం సక్సెస్ అనే భావనలో ప్రేక్షకులు ఉండిపోతారు. దేవిశ్రీ సంగీతంతో పాటుగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు. అయితే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్లు గతంలోనే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు నటి, నిర్మాత ఛార్మి సన్నాహాలు చేస్తుందట. ఆయన…
ఇటీవల తమిళ దర్శకుడు ఎస్. శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తాననే సరికీ ఆ చిత్ర తమిళ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మోకాలడ్డుపెట్టాడు. నిర్మాతగా ఆ సినిమా కథాహక్కులు తనవే అని క్లయిమ్ చేశాడు. అయితే ఆ కథను తయారు చేసిన రచయితగా ఆ హక్కులు తనకే ఉంటాయని శంకర్ వాదిస్తున్నాడు. తాజాగా ‘రాధే’ సినిమా పాట విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన చర్చే చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘డి.జె. దువ్వాడ జగన్నాథం’…