పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. అలాగే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తమ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ సినిమా ప్రచారచిత్రం అభిమానులలో అంచనాలను, ఉత్సుకతను పెంచేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి అయాంక బోస్ కెమెరామేన్ గా వ్యవహరించనున్నారు. ఆనంద సాయి ఆర్ట్ డైరక్షన్ చేస్తుంటే ఫైట్స్ ను రామ్ లక్ష్మణ్ అందించనున్నారు.