Devineni Avinash: వరద ప్రభావిత ప్రాంతలలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాణిగారితోట 17, 18వ డివిజన్ లలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నగరంలోని వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అని ఆయన తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది.. గురువారం రాత్రి.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు అవినాష్.. అయితే, ఆయన్ని అడ్డుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు.
బెజవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తుంటే అవినాష్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు.
కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ - గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు.
విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోందని తెలిపారు. విజయవాడ నగరం…
విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
పేద వారికి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అక్కర్లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.