రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మ్యూజికల్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో జరగాల్సి ఉండగా, చివరి క్షణంలో అనుమతుల సమస్యలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌కు విశాఖ పోలీసులు భద్రతా కారణాలతో అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. విశాఖలోని విశ్వనాథ్ కన్వీన్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ఇటీవల ఈ వేదికలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. గతంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లోని…