సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. అవును! ప్రముఖ సంగీత దర్శకుడు నటుడిగా పరిచయం కాబోతున్న సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేం వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేసే ఆలోచన చాలా కాలంగా తిరుగుతూనే ఉంది. పలు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా, ఆయన ఎప్పుడూ…