‘కథలు కరువైనప్పుడు పాత కథలనే ఆశ్రయించు’ అని పెద్దలు చెప్పారు. అదే తీరున సినీజనం కొత్తసీసాలో పాత సారాలాగా, పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలా పలుమార్లు రీమేక్ కు గురైన కథ ఏదయినా ఉందంటే, మన దేశంలో ‘దేవదాసు’ కథ అనే చెప్పాలి. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 1901లో రాసిన ‘దేవదాసు’ నవల 1917 జూన్ 30న ప్రచురితమయింది. ఆ కథ ఆధారంగా 1928లో…
భారతదేశంలో బెంగాలీ సాహిత్యం ఇతర ప్రాంతాలపైనా విశేషమైన ప్రభావం చూపింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన బెంగాలీ, ఆంగ్ల రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను అలరించారు. ఆ రోజుల్లో ఆయనకు ఎనలేని అభిమానగణాలు ఉండేవి. అంతటి రవీంద్రనాథుడు తనను కట్టిపడేసే రచనలు చేసిన రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ అని సెలవిచ్చారు. శరత్ చంద్రుడు కూడా వంగదేశ రచయితనే. రవీంద్రుని కంటే వయసులో 15 ఏళ్ళు చిన్నవాడు. అయినా రవీంద్రుని, శరత్ బాబు రచనలు అమితంగా ఆకర్షించాయంటే…