Devara Success Meet : ఆరేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సునామీని సృష్టిస్తున్నాయి.
ప్రస్తుతం ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంటకే దేవర జాతర మొదలైంది. దీంతో మూడు రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది దేవర పార్ట్ 1. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్…