నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 1986వ సంవత్సరం మరపురానిది. ఆ యేడాది ఆయన నటించిన ఏడు చిత్రాలలో మొదటి సినిమా పరాజయం పాలు కాగా, తరువాత వచ్చిన ఆరు సినిమాలు వరుసగా విజయకేతనం ఎగురవేశాయి. ఈ యేడాది బాలయ్య నటించిన “ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు” చిత్రాల ఘనవిజయం తరువాత దక్కిన నాల్గవ విజయం ‘దేశోద్ధారకుడు’. ఆ తరువాత ‘కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు’ వచ్చి విజయం సాధించాయి. బాలకృష్ణ, విజయశాంతి జంటగా రూపొందిన ‘దేశోద్ధారకుడు’…