బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ “నేడు సోనూసూద్ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా మారారు. సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోను సూద్ సహాయం చేస్తాడు. నేడు పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అలాంటిది సోను సూద్ సాయం చేస్తున్నారు. మేము ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే ఓ మంచి…