ఏపీలో పీఆర్సీ రగడ ఇంకా చల్లారలేదు.పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వ చర్చల అనంతరం తమ పోరాటాన్ని ఆపేశారు. అయితే మరో వర్గం మాత్రం పీఆర్సీ స్ట్రగుల్ కమిటీపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల విమర్శలపై ఘాటుగా స్పందించింది పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ. ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు నలుగురు నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ. తమపై కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రచారంపై…
సోషల్ మీడియాలో కామెంట్లు శృతిమించుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. సెలబ్రిటీలు, రాజకీయనేతలు, సినీతారలు.. ఇలా ఒకరిని కాదు.. అసభ్యకరమైన బూతులు, కామెంట్ల రూపంలో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ కుమారుడిపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి వ్యక్తిత్వ దాడిని అరికట్టలేమా?