అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.