ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈమెయిల్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్ ఇలా ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీల తర్వాత నకిలీది తేల్చారు. అయితే ఢిల్లీలో శుక్రవారం ఓ స్కూల్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది.