Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది.
ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈమెయిల్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్ ఇలా ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీల తర్వాత నకిలీది తేల్చారు. అయితే ఢిల్లీలో శుక్రవారం ఓ స్కూల్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది.
Bomb Threat : ఢిల్లీలోని 150 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ నెల ప్రారంభంలో దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బాంబును పెడతామని బెదిరించే ఇమెయిల్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుండి పంపినట్లు అనుమానిస్తున్నారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
దేశ రాజధానిలో 11ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఓ కేంద్రీయ విద్యాలయంలో పొరపాటు వెళుతూ ఇద్దరు సీనియర్లను ఆబాలిక ఢీకొట్టడంతో.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆఘటనపై టీచర్‌కు ఆబాలిక తెలిపిన సంస్థ నిర్వహకులు ఈఘటనను బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు.