Harassment: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు(40) పాఠశాల ఆవరణలో ఎనిమిదేళ్ల 3వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Turkey-Syria Earthquakes: మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి
క్రీడా ఉపాధ్యాయుడు 2016 నుండి తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. చిన్నారిని ఆ వ్యక్తి ప్రలోభపెట్టి పాఠశాలలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గత వారం జరిగింది. చిన్నారి ప్రవర్తనపై ఆమె తల్లికి అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల చిన్నారి తన తల్లి అడిగితే జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తమకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అమృత గుగులోత్ తెలిపారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.