దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం 361 ఉండగా.. బుధవారం ఉదయం 400 దాటేసింది. దీంతో పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.…