Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిలీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.