ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు చాలా మంది దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు.
హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఉగ్ర కుట్రను వెలికితీసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక నిన్నటి నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 25 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు అక్రమాలను గుర్తించారు.
వామ్మో.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా చాలా పెద్ద కుట్ర జరిగినట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థలు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్ర మూలాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడ్డాయి.
ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. తవ్వేకొద్దీ కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా ఉగ్రవాదులకు సంబంధించిన మరో కారును అధికారులు గుర్తించారు. ఉగ్ర కుట్రలో భాగంగా 5వ వాహనం అద్దెకు తీసుకున్నట్లుగా కనిపెట్టారు. హ్యుందాయ్ i10 కారును అద్దెకు తీసుకున్నారు.
ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కీలక ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా డాక్టర్ షాహీన్ భారీ కుట్రలకు ప్రణాళికలు రచించింది. ఉగ్రదాడులకు కర్త, కర్మ, క్రియ మొత్తం షాహీనే అని అధికారులు గుర్తించారు. తాజాగా సన్నిహిత డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఒక షోరూమ్‌లో కారు కొనుగోలు చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది.
ఢిల్లీ కారు బ్లాస్ట్‌లో ఉగ్రవాది ఉమర్‌కు సహకరించిన.. క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఇతడే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేశాడు. ఉగ్రవాదం వైపునకు మళ్లించాడు. ప్రస్తతం డానిష్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి.