ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పేలుడులో కారు నడుపుతున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి సమాచారం వెలువడింది. అతను మెసేజ్ పంపడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడని అధికారులు గుర్తించారు. ఈ మొబైల్ యాప్‌ను “సెషన్” అని పిలుస్తారు, దీనిని ప్రైవేట్ చాటింగ్ కోసం ఉపయోగిస్తారు. Also Read:SSMB29 Rudra: కుంభ, మందాకిని ఓకే.. నెక్స్ట్ ‘రుద్ర’..? సెషన్ యాప్ ఒక ప్రైవేట్ మెసెంజర్ ప్లాట్‌ఫామ్. ఇది Google…
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను ఇంత దారుణంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని అన్నారు.…
Delhi Blast: చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలు. ఈ విభాగం మహిళలను…
ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని…
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక…