జన్‌లోక్‌పాల్ అన్నాడు! అవినీతికి వ్యతిరేకం అన్నాడు! చివరికి అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడు! అది 2011 సంవత్సరం. ఢిల్లీ జంతర్‌మంతర్. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్యవస్థను తీసుకురావాలని అన్నాహజారే దీక్ష చేస్తున్న రోజులవి. అదే వేదికపై పెద్దసైజు కళ్లద్దాలు పెట్టుకొని, ఓ వ్యక్తి అటూఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. సగటు మధ్యతరగతి మనిషిలా ఉండే, ఆ మిడల్ ఏజ్డ్ పర్సన్ మీడియాను ఆకర్షించాడు. యువకులను ఆలోచింపజేశాడు. సీనియర్ సిటిజన్ల దృష్టిలో పడ్డాడు.