నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు గుంటూరు టీడీపీ నేతలు. పైగా ప్రచార యావ పెరిగిపోవడంతో.. వ్యక్తిగతంగా హైలైట్ కావడానికే చూస్తున్నారట. ఏ కార్యక్రమం చేసినా ఫొటోలు దిగడం.. గ్రూపులు కట్టుకోవడమే సరిపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. ఈ పోకడలు కార్యకర్తల్లో కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ.. నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన నాయకులే ఈ తరహాలో వింత పోకడలకు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట. గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు..గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు నగర టీడీపీ…