తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు.
నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆఫ్ఘాన్ ఆలౌరౌండ్ ప్రదర్శన చూపించింది. దీంతో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదిలా ఉంటే.. తమ జట్టు ఓటమిపై కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. చైనాతో జరిగిన స్వర్ణ పతక పోరులో భారత్ ఓటమి పాలైంది.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.