ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీప్ సీక్ చైనాలోని అన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చైనా ప్రజలు డీప్ సీక్‌ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, రోబో వ్యాక్యూమ్ క్లినర్లలో డీప్ సీక్‌ని ఉపయోగిస్తున్నారు. అనేక హోమ్ అప్లికేషన్స్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల్లో డీప్ సీక్ కృత్రిమ మేథను ఉపయోగిస్తామని ప్రకటించారు.
China : చైనా తన సాంకేతికత, అనేక రంగాలలో కొత్త ప్రయోగాల ద్వారా ఏ పాశ్చాత్య దేశానికన్నా తక్కువ కాదని నిరూపించుకుంది. చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేసింది.
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.