నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్‌లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం…
‘రోబో’తో మరోసారి బాలీవుడ్ బేబీ రొమాన్స్ చేయబోతోందట! సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ మూవీలో బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా పదుకొణే అనే టాక్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ని ఎగ్జైట్ చేస్తోంది. నిజానికి రజనీతో దీపిక గతంలోనే కలసి పని చేసింది. ‘కొచ్చాడయన్’ సినిమాలో టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ తలైవా సరసన మెరిసంది. కానీ, అది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేశారు. రాబోయే చిత్రం మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటుందట. రజనీకాంత్…
నిర్మాత మధు మంతెన, దీపికా పదుకొణే కొలాబరేషన్ లో ‘మహాభారత్’ సినిమా వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. ద్రౌపది దృష్టి కోణం నుంచీ కథ చెబుతామని కూడా అన్నారు. కానీ, ఆ తరువాత వెండితెర ఇతిహాసం గురించి ఇదీ సంగతి అని ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ‘ద్రౌపదిగా దీపికా’ అనే ప్రాజెక్ట్ కాస్త వెనుకబడిపోయింది. ఇప్పుడు మరోసారి, దీపికతో సినిమాపై భారీ చిత్రాల నిర్మాత మధు మంతెన నోరు విప్పాడు! మహాభారతం కాదు ముందుగా…
అగ్గిపుల్లా, సబ్బు బిల్లా, కుక్క పిల్లా అంటూ శ్రీశ్రీ కవిత్వం చెప్పారు. ఆయన ఉద్దేశం అప్పట్లో వేరుగానీ… ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల లాగే కుక్క పిల్ల కూడా పెద్ద మార్కెట్ ప్రాడక్ట్ గా మారిపోయింది! గత అయిదేళ్లుగా మన దేశంలో పెట్ మార్కెట్ జోరుగా పెరుగుతోందట. కుక్కల్ని పెంచుకునే శునక ప్రియులు 50 శాతం పెరిగారు. మార్జుల ప్రేమికుల ఇళ్లలో 40 శాతంపైగా పిల్లుల సంఖ్య ఎక్కువైందట! ముందు…
‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి ఎంట్రీ మూవీగా ప్రచారం అవుతోన్న ‘పఠాన్’ అనేక విధాలుగా ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఓ రేంజ్…
‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సెన్సిటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్. అయితే, ఆయన గత చిత్రం ‘జీరో’. షారుఖ్ లాంటి బడా స్టార్ ని మరుగుజ్జుగా చూపించి జనాలకి షాక్ ఇచ్చాడు. సినిమా ‘జీరో’ అన్న పేరుకు తగ్గట్టుగా నెగటివ్ రివ్యూలతో నీరుగారిపోయింది. కాకపోతే, జూన్ 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోన్న బీ-టౌన్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన ముద్ర మాత్రం ఇప్పటికే వేయగలిగాడు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన…
ఇప్పుడు డాలర్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక జోనాస్… మొదటిసారి 5వేలు ఆర్జించిందట! ఆ డబ్బులు తన తల్లి చేతిలో పెట్టానని చెప్పింది మిస్ చోప్రా! మమాస్ గాళ్ కదా…ప్రియాంక తన ఫస్ట్ ఎర్నింగ్స్ ని మమ్మీ చేతికి ఇస్తే దీపికా పదుకొణే నాన్న ముందు ఉంచిందట! అలా డాడీకి తన మొదటి సంపాదన అందించానని చెప్పిన డీపీ అప్పటి ఆ అమౌంట్ మాత్రం మరిచిపోయింది! డాడీస్ డాటర్ అనాల్సిందే…సోనమ్ కపూర్ హీరోయిన్…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు మేకర్స్. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “పఠాన్” సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో రీస్టార్ట్ అయ్యింది. ఇక్కడ జరగనున్న 15 నుంచి 18 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా…
‘’రణవీర్ సింగ్ నా వాడు’’ అంటోంది దీపికా పదుకొణే! అది అందరికీ తెలిసిందేగా అంటారా? నిజమే, 2018లోనే రణవీర్ ని దీపిక కొంగున ముడి వేసుకుంది. అంతే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పడప్పుడూ తన భార్య కోసం సొషల్ మీడియాలో అద్భుతమైన మాటలు, కవితలు రాసేస్తుంటాడు. రణవీర్ కి దీపిక మీద ఉన్న ఇష్టం చాలాసార్లు బయటపడుతూనే ఉంటుంది. అయితే, దీపూ అంతగా బయటపడదనే చెప్పాలి. కానీ, వీలైనప్పుడల్లా హజ్బెండ్ ని ఆహా, ఓహో అంటూ…
ఆమె పేరులోని ఆశ మాటల్లోనూ మార్మోగింది. ఇంతకీ, అందగత్తె కోరిక ఏంటో తెలుసా? రణబీర్ కపూర్ తో కలసి ‘తమాషా’ సినిమాలో మాదిరిగా రోడ్ ట్రిప్ వేయాలనుకుంటోందట! అంతే కాదు, పర్వత ప్రాంతమైతే ఇంకా మంచిదట! ఆమెకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి తన అభిమాన హీరో రణబీర్ తో కలసి ప్రకృతి ఒడిలో, పర్వతారోహణలు చేస్తూ మథురమైన అనుభూతులు మూటగట్టుకోవాలని ఉందట! ఇంతకీ, ఇదంతా అంటోంది ఎవరంటారా? ఆశా నెగీ!ఆశ ఎవరో మనకు తెలిసే అవకాశాలు…