టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్‌లో దీపికా కనిపించబోరని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు…