డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది…