డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది టీమ్.
రోషన్ కనకాల ‘మోగ్లీ’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కలర్ ఫోటోతో ఫేమ్ తెచ్చుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అదేరోజు నందు హీరోగా ‘సైక్ సిద్దార్థ్’ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సురేష్ ప్రొడక్షన్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది. కార్తీ వా వాతియార్ తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు కూడా డిసెంబర్ 12నే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక క్రిస్మస్‌కు పెద్ద క్యూనే ఉంది. ఎన్నాళ్ల నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ వైవిధ్యమైన స్టోరీతో తెరకెక్కిన ‘శంభాల’తో వస్తున్నాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన శంభాల డిసెంబర్ 25న రాబోతోంది. అదే రోజున యువ హీరో రోషన్ మేక స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇవే కాదు నిర్మాత సురేష్ ప్రజెంటర్గా వ్యవహరిస్తోన్న పతంగ్, దండోరా లాంటి చిన్న సినిమాలు కూడా క్రిస్మస్ రోజునే థియేటర్లను ఆక్యుపై చేయబోతున్నాయి. వీటి కన్నా ముందు టాలీవుడ్ బాక్సాఫీసుపై దాడి చేయబోతోంది డబ్బింగ్ ఫిల్మ్ అవతార్ 3. జేమ్స్ కెమెరూన్ అద్భుత కళా ఖండం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా క్లికైతే క్రిస్మస్ కి రిలీజయ్యే సినిమాలపై భారీ ప్రభావం చూపిస్తుందని క్రిటిక్స్ వాదన.
Also Read: Ibomma Ravi: పెద్ద ప్లానింగే.. భవిష్యత్ ప్రణాళికలను పోలీసులకు చెప్పిన ఐబొమ్మ రవి!
గత ఏడాది కల్కి, పుష్ప2తో ధౌజండ్ క్రోర్ మూవీస్ చూసిన టాలీవుడ్.. ఈ ఏడాది మాత్రం బేల చూపులు చూసింది. వెయ్యికోట్లు సంగతి పక్కన పెడితే.. 500 కోట్లు మార్క్ కూడా రీచ్ కాలేదు. ప్రభాస్, అల్లు అర్జున్ లేదంటే రాజమౌళి.. వీళ్లు లేరంటే టాలీవుడ్ ఈ ఫీట్ సాధించడం కష్టమా అంటే.. అవునని బలంగా నమ్మాల్సి వస్తుంది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రామ్ చరణ్, తారక్ చిత్రాలు కూడా బోల్తా పడటం కూడా మైనస్ అయ్యింది. ఇక వెంకీ, పవన్ కళ్యాణ్ తమ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలను చూసినా.. 500 కోట్లు టచ్ చేయలేదు. ఇక హోప్స్ అన్నీ బాలయ్య అఖండ 2 పైనే. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు బీట్ బాలయ్య చేస్తారా?, 500 కోట్లు కొట్టలేకపోయామన్న లోటును గాడ్ ఆఫ్ మాసెస్ పూడుస్తారా? లేదా? అనే విషయం తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.